సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైరైటీ సినిమా హీరోగా రాణిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ సినిమా గత సంవత్సరం ఆఖరి సినిమాగా డిసెంబర్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. మంచి రిచ్ గా.. సుభాష్ చంద్రబోస్ కాలానికి చెందిన పిరియాడికల్ గూఢచారి సినిమాగా మంచి టేకింగ్ తో తీసిన ఈ సినిమా ఇటీవల ఓ మోస్తరు లాభాలు సంపాదించిన హిట్ సినిమాగా నిలబడింది. . అయితే రన్నింగ్ బాగుండగానే సంక్రాంతి కొత్త సినిమా లకు థియేటర్స్ కొరత తో ‘డెవిల్’ అన్ని చోట్ల 17 రోజులకే తొలగించారు, దానితో అప్పుడే ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో సంక్రాంతి కానుకగా ఈ సరికొత్త సినిమా జనవరి 14న స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డెవిల్ ‘సినిమాకి దర్శకుడిగా మొదటి నవీన్ మేడారం పేరు వేశారు, కానీ తరువాత అతనితో వచ్చిన విభేదాల కారణంగా ఈ సినిమా నిర్మాత అయిన అభిషేక్ నామ, తనే దర్శకత్వం చేశానని తన పేరే వేసుకున్నారు. అదో పెద్ద వివాదం అయ్యి బాగా ట్రెండ్ అయ్యింది.
