సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హడావిడి ఎక్కువ .. విషయం తక్కువ’ అన్న స్థాయిలో నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం సినిమా పరిస్థితి. పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రముఖ బాషలలో ఇటీవల విడుదలయి ఈ సినిమాకు ఉత్తరాదిన థియేటర్స్ తో పాటు అసలు ఎవరు పట్టించుకొన్న పాపాన పోలేదు. భారీ ప్రమోషన్ ఖర్చులు లాస్ .100 కోట్ల కలెక్షన్స్ సినిమా అంటూ పబ్లిసిటీ హడావిడి తప్ప.. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఓ మోస్తరు విజయం సాధించిన ఈ సినిమా.. ఏపీలో పలు ప్రాంతాలలో నష్టాలు మిగిలిచిందని టాక్.. అయితే సినిమాలో విలన్ గా ఎస్ జె సూర్య కు , మురళీధర్ శర్మ కు మంచి మార్కులు పడ్డాయి. మాస్ హీరోగా ఎదగాలన్న నాని కోరిక మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఈ సినిమా రీరికార్డింగ్ మాత్రం థియేటర్స్ లో అదిరిపోయింది. అయితే .. తాజగా సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. సెప్టెంబర్ 26న సరిపోదా శనివారం సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఇక ఓటిటి లో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *