సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ సినీ నటి, శృంగార తారగా,వివాదాస్వాద ప్రకటనలతో ఖ్యాతి గాంచిన మోడల్ పూనమ్ పాండే నేడు, శుక్రవారం ఆకస్మికంగా మరణించారని వచ్చిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గత 3 రోజులు వరకు ఆమె పార్టీలలో ఉల్లాసంగా గడిపిన ఆమె ఇక లేరు అన్నవార్త బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ..ఆమె చాల కాలంగా సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని అదే ఆమె ప్రాణాలు హరించిందని వైద్యులు తెలిపారు. ఆమె 32 ఏళ్ల వయసులోనే ఆమె క్యాన్సర్‌తో కన్నుమూయడం అందరిని కలచివేసింది. నిజానికి భారతీయ మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్‌ది రెండో స్థానం. ఈ క్యాన్సర్‌ను తొలి నాళ్లలో గుర్తిస్తే సులువుగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. భారత్‌లో తయారైన తొలి దేశీ వ్యాక్సిన్ గతేడాది జనవరిలో అందుబాటులోకి వచ్చింది. మొత్తం నాలుగు రకాల వైరస్‌లను ఇది నాశనం చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *