సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా మరో వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ అంత ఒక ఎత్తు భీమవరం ఒక ఎత్తు.. అన్న సంగతి అందరికి తెలిసిందే.. పండుగ సంబరాలు మొదలయ్యాయి. భీమవరం లో సలార్ సినిమా 12 స్క్రీన్స్ లో రిలీజ్ తో పాటు పట్టణం అంత ప్రభాస్ ఫ్లెక్సీ ల భారీ గ్యాలరీలతో సందడి చెయ్యడానికి ప్రభాస్ అభిమానులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. 2వ పట్టణంలోని భారీ అపార్ట్ మెంట్స్ కు సలార్ 50 నుండి 100 అడుగుల ఫ్లెక్సీ లను ఏర్పాటు చెయ్యనున్నారు.ఇక రిలీజు కు ఒక రోజు ముందు డిసెంబర్ 21న రాత్రి నుండి సందడి కి అంతే ఉండదు.. ఇదిలా ఉండగా సుదీర్ఘ కాలంగా షూటింగ్ జరిగి, అనేక అడ్డంకులు అధిగమించి రిలీజ్ అవుతున్న సలార్ సినిమా హైదరాబాద్ లో సంధ్య 70ఎం ఎం లో వేసే మొదటి షో టికెట్ ను దర్శక ధీరుడు రాజమౌళి కొనుగోలు చేసారు. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసి బాహుబలి సిరీస్ తో ప్రపంచం తో జేజేలు కొట్టించిన రాజమౌళికి ప్రభాస్ అంటే ఎంతో అభిమానం. ఇప్పుడు సలార్ సినిమా కోసం గంటన్నర సుదీర్ఘ ఇంటర్వూ చేసారు. ఈ ఇంటర్వూ లో, ప్రభాస్, పృధ్వీ రాజ్, ప్రశాం త్ నీల్ ముగ్గురూ పాల్గొన్నారు.ఈ ఇం టర్వూ తరువాత తొలిటికెట్ ను రాజమౌళి కొనుగోలు చేసారు. అందుకోసం ఆయన 10,116 రూపాయలు చెల్లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *