సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభాస్ హీరోగా వందల కోట్ల వ్యయం తో నిర్మించిన పాన్ ఇండియా సినిమా సలార్ కు 400 కోట్ల పైగా థియేటర్స్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక టికెట్ రేట్లు పెంచుకునేందుకు అదనపు షో ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. నిర్మాతలు సమర్పించిన సినిమా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని నిబంధనల ప్రకారమే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనితో సలార్ సినిమాను ప్రదర్శించే థియేటర్లలో టికెట్ రేట్లు 40 రూపాయల మేర అదనంగా పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పెంచిన రేట్ల ప్రకారం , సలార్ టికెట్ సింగిల్ స్క్రీన్ లో 195 రూపాయలు, మల్టీప్లెక్సు ల్లో 225 రూపాయలుగా ఉండబోతోంది. తెలంగాణలో మాత్రం సలార్ సినిమాకు సిం గిల్ స్క్రీ న్స్ లో 254 రూపాయలు, మల్టీప్లెక్సు ల్లో 413 రూపాయల టికెట్స్ అమ్మెందుకు అనుమతులిచ్చా రు. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో (హైదరాబాద్ లో 10 లొకేషన్లు) బెనిఫిట్ షో కింద అర్థరాత్రి ఒంటిగంటకు షో వేసుకునేందుకు కూడా అనుమతులిచ్చా రు. ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ లోనే రికార్డు స్థాయిలో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సలార్ కు నేటి నుండి ఏపీలో కూడా అనుమతులు రావడంతో, ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.భీమవరంలో కూడా రేపు అర్ధరాత్రి నుండి సలార్ ప్రదర్శన ప్రారంభమై మొత్తం ఒక్క రోజులో 66 ఆటలు టౌన్ మొత్తము ఫై ప్రదర్శించే అవకాశం ఉంది. భీమవరం చినమీరం నాగరాజు మాల్ లోరేపు గురువారం ఉదయం 12 గంటలకు అన్నసమారాధన , పేదలకు వస్త్ర పంపిణి ప్రభాస్ అభిమానులు చేపట్టారు.
