సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా నేడు సోమవారం సలార్ నుంచి 2వ ట్రయిలర్ వచ్చింది. మొత్తం యాక్షన్ సీన్స్ తో ప్రభాస్ అభిమానులలో జోష్ నింపేలా మంచి సౌండ్ సిస్టమ్ జోడించి అలా కట్ చేసారు దర్శ కుడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరహాలో మంచి పిట్ నెస్ తో ట్రైలర్ లో దడదడ లాడిస్తున్నాడు . ఒక్క మాటలలో చెప్పాలంటే బాహుబలి తో KGF ను మిక్స్ చేసి తయారు చేసిన సినిమాగా ట్రైలర్ చుస్తే అర్ధం అయిపోతుంది. ఈ ట్రయిలర్ లొ చూపించినవి మూడు ఫైట్ల నుంచి కట్ చేసినవే. ఇంకా మరో రెండు ఫైట్లు వున్నాయి. వాటిలో రుద్ర రసం ఏ రేంజ్ లో తీశారో కానీ.. ఇక ఎలానూ సలార్ ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి నుండి బీభత్స జాతర మొదలెడతాడు..
