సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ ఎన్నికల ప్రచారం లో ఉన్నపటికీ భార్య భారతి సమేతంగా తెలుగువారి క్రోధి నామ ఉగాది నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు. .. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో నేడు, మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది.ఉగాది వేడుకలకు హాజరైన సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులకు వేద పండితులు నుదుట కుంకుమ ధారణ చేయించి, శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం ఇచ్చా రు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మె ల్యే బొల్లా బ్రహ్మనాయుడు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది పండుగ శుభాకాం క్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అన్నీ శుభాలు, విజయాలు సిద్ధిం చాలని సీఎం ఆకాం క్షిం చారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నా రు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లోప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిలాల్లని అన్నారు.
