సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సుమారు 25 ఏళ్ళ తరువాత .. సంక్రాంతి పండుగ రోజులు నేపథ్యంలో ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా సాధారణ చార్జీలతోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. గతంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు (అంటే 150శాతం చార్జీలు) వసూలు చేస్తూ వచ్చిం ది. కానీ తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్లో ప్రత్యే క బస్సు లను సాధారణ చార్జీలతోనే నడిపింది. అదే రీతిలో రానున్న సం కాంత్రి సీజన్లో కూడా ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నడపనుంది. సంక్రాంతికి వచ్చే ప్రయాణికుల సౌకర్యా ర్థం 6,400 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయిం చింది. సంక్రాంతికి ముందుగా జనవరి 6 నుం చి 14 వరకు 3,120 ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తారు. సంక్రాంతి అనం తరం జనవరి15 నుం చి 18 వరకు 3,280 ప్రత్యేక బస్సు సర్వీ సులు నడుపుతారు. మొత్తం 6,400 ప్రత్యేక బస్సు ల్లో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే 3,600 బస్సు లను ఏపీకి నిర్వహించనుం డటం విశేషం . బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 బస్సు సర్వీ సులను రాష్ట్రం లోని వివిధ ప్రాం తాలకు నడుపుతారు. ప్రయాణికుల సౌకర్యా ర్థం ప్రత్యే క బస్సు ల్లో ముం దస్తు రిజర్వే షన్కు అవకాశం కల్పిం చారు. ఆర్టీసీ పోర్టల్(www.apsrtconline.in(http://www.apsrtconline.in) ద్వారా నేరుగా రిజర్వే షన్ చేసుకోవచ్చు . ఏటీబీ ఏజెంట్లు, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు . ప్రయాణికులకు సమాచారం కోసం 24/7 కాల్సెం టర్( 0866–2570005)ను ఆర్టీసీ నిర్వ హిస్తుం ది. ఆర్టీసీ అన్ని దూర ప్రాం త సర్వీ సులకు వచ్చి వెళ్లేం దుకు ముం దుగా రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణచార్జీలో 10శాతం రాయితీ కల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *