సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వేట్లపాలెం గ్రామ శివార్లలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
