సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా సామర్లకోటలో నేడు, గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అనిచెప్పడానికి గర్వపడుతున్నా నన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నా యని తెలిపారు. సామర్లకోట లేఅవుట్లో వెయ్యి కి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, ఒక్కరికి 30 లక్షల చప్పున విలువ చేసే ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వ కుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *