సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ కు 2న్నర లక్షల పైగా రికార్డు మెజారిటీ తో ఎన్నికయిన ఎన్డీయే కి చెందిన బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ నేడు, బుధవారం తమ పార్టీ లోక్ సభ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మెన్, పాక సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా జనసేన అడ్జక్షుడు కొటికలపూడి చినబాబు, బన్నీ వాసు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జిల్లా బీజేపీ నేతలు సమక్షంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 34 ఏళ్లుగా తాను ఒక కార్యకర్తగా నిబద్దతతో బీజేపీ లో పనిచేసినందుకు కూటమి సహకారంతో జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రజలు , టీడీపీ , జనసేన, ఎంపీ పదవిని కనివిని ఎరుగని మెజారిటీ తో గెలిపించినందుకు, నాకు ప్రచారంలో సహకరించిన మీడియా మిత్రులకు కృతజ్ఞలు తెలియజేస్తున్నానని అన్నారు. తనకు ఆస్తులు అంతస్తులు,భారీ వ్యాపారాలు లేనప్పటికీ ఒక సామాన్యునికి ఎంపీ పదవి ఇస్తే ఎంత బాధ్యతగా నిర్వహిస్తారో, ఎంత అభివృద్ధి చెయ్యొచ్చో తాను కేంద్ర పెద్దల సహకారంతో నిరూపించి తనను గెలిపించిన ప్రజలు ఋణం తీర్చుకొంటానని వర్మ అన్నారు. ఇక్కడ గెలిచిన 7గురు ఎమ్మెల్యేలు అందరు తమ కూటమి సభ్యులే కాబట్టి సమస్యలు రోబోవని పేర్కొన్నారు. జనసేన చినబాబు మాట్లాడుతూ.. తాను భీమవరం మున్సిపల్ చైర్మెన్ గా పనిచేసిన కాలంలో పట్టణ అభివృద్ధికి ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దగ్గరకు తీసుకోని వెళ్లి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించడం లో వర్మ గారి సహకారం మరువలేనని, ఇప్పుడు ఆయనే స్వయంగా ఎంపీగా జిల్లాను అభివృద్ధి పధంలో పరుగులు పెట్టిస్తారని చినబాబు భరోసా ఇచ్చారు,
