సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: 17 ఏళ్ళ క్రితం దర్శక ధీరుడు రాజమౌళి దర్శక విశ్వరూపం యాంగ్ ఎన్టీఆర్ ను అగ్ర హీరోగా మార్చేసిన ‘ సింహాద్రి సినిమా ను ఎవరు మర్చిపోలేరు. అటువంటి అపూర్వ సినిమాను జూ. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని.. మే 20వ తేదీన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా నిర్వాహకులు తెలియజేశారు. అంతే కాదు, ఓ గ్లిమ్స్ వీడియోని కూడా విడుదల చేశారు. సరికొత్త సౌండింగ్‌తో, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ట్యాగ్‌తో ఈ వీడియో ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉంది. ఈ వీడియో, విడుదల తేదీ ప్రకటన సందర్భంగా గత ఆదివారం ఉదయం నుంచి ‘సింహాద్రి 4K’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. మధ్యలో ఈ వీడియో విడుదల కాస్త ఆలస్యమైనప్పటికీ.. ఫ్యాన్స్ ట్రెండ్ విషయంలో మాత్రం తగ్గలేదు.ఈ రి రిలీజ్ లో సింగమలై ‘ సింహాద్రి ఎన్ని కోట్లు కొల్లగొడతాడో చూడాలి..
