సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఆర్ 5 జోన్‌లో ఇళ్ళ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ తన ప్రసంగంలో తీవ్ర పదజాలంతో జనసేన అధినేత పవన్ కల్యాణపై విరుచుకుపడ్డారు. ఆయన మాటలలో.. ప్రజలకు ఇచ్చిన మాటకోసం కాంగ్రెస్ పెద్దలు ఎన్ని కుయుక్తులు పన్నిన ఢిల్లీలో సోనియా గాంధీ సింహాసనాన్ని కుదిపేసిన ఘనుడు జగన్ ..ఒంటరి పోరాటం చేసిన స్వంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ధీరుడు ,వీరుడు జగన్ ఎక్కడ?అరడజను పార్టీలతో పొత్తు పెట్టుకొని గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ స్థాయి ఎక్కడ? చంద్రబాబు ముసలి నక్క. పవన్ కళ్లాణ్అనేవాడు పిచ్చికుక్క. పెళ్లాలను అలాగే పార్టీలను మార్చుతాడు. మార్చడం తార్చడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇతనికి సలహాలు ఇవ్వడనికి ఢిల్లీలో విగ్గు రాజు ఒకడున్నాడు.. వాళ్ళను వీళ్ళను కలపడానికి పవన్ ఒక కంపెనీ పెట్టుకొంటుంటే బాగుటుంది,అంటూ ఎద్దేవా చేసారు, ఎంత మంది వచ్చినా మా జగన్న వెంట్రుక కూడా పీకలేరు. ఊరపంది ఒకడు తిరుగుతున్నాడు. సింహం లాంటి జగనన్నకు నువ్వు పోటీ ఏంట్రా?’’ అంటూ జోగి రమేష్ ప్రసంగాన్ని దూకుడు పెంచడంతో అక్కడే ఉన్న సీఎం జగన్ విస్తుపోయి అలాంటి మాటలు వద్దని పలు సార్లు సంజ్ఞలు ఇచ్చినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఎంతకీ మంత్రి ప్రసంగాన్ని అపకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ఒక దశలో అసహనం వ్యక్తం చేశారు.
