సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో ఏపీలో ప్రత్యేక పుణ్య దినాలలో పుణ్యక్షేత్రాలకు భారీ సంఖ్యలో వెళ్లే భక్తులకు రక్షణ కరువైపోతుంది. పలువురు భక్తులు మృత్యువు భారిన పడుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది.ఎక్కువ మంది భక్తులు వస్తారు అని తెలిసినప్పటికీ ఎందుచేతనో నిస్సందేహంగా దేవాలయాలలో నిర్వహణ లోపాలు ఎక్కువయ్యాయి. తాజగా నేడు, బుధవారం సింహాచలంలో చందనోత్సవంలో శ్రీ స్వామివారి నిజరూప దర్శనం వీక్షించడానికి ఎంతో ఆశగా దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఘోర ప్రమాదం జరిగింది. గత అర్ధరాత్రి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో రూ.300 టికెట్ కౌంటర్ వద్ద నేడు, తెల్లవారు జాము (ఇటీవల నిర్మించిన ?) గోడ అకస్మాత్తుగా కూలిపోయి అక్కడికక్కడే 8 భక్తులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 8 మందికి గాయాలు అయ్యాయి. రిస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనపై హోంమంత్రి, కలెక్టర్ సమీక్షించారు.ఒక్క భారీ వర్షానికే కూలిపోయిందంటే.. ఇటీవల కొత్తగా నిర్మించిన గోడ నాణ్యత ప్రమాణాలపై హోమ్ మంత్రి తో పాటు అధికారుల కసరత్తు జరుగుతుంది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
