సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిసెంబర్ నెల నుండి పండుగల సీజన్ లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌-అనకాపల్లి(Secunderabad) మార్గంలో ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు సికింద్రాబాద్‌ నుంచి ప్రతి గురువారం సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేకరైలు (07055 నెంబర్‌) అనకాపల్లికి బయల్దేరనుంది. డిసెంబరు 5వ తేదీ నుంచి మార్చి 27 వరకు ప్రతీ శుక్రవారం అనకాపల్లి నుంచి ప్రత్యేక రైలు ( 07056 నెంబర్‌) నడుస్తాయని తెలిపారు. మార్గమధ్యంలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని(Rajahmundry, Annavaram,), ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *