సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్ 8వ తేదీన పట్టాలు ఎక్కనుంది అని భావిస్తున్నారు. సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య ఈ రైలు అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాల సమాచారం. వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఏయే స్టేషన్లలో ఆగుతుంది, ఛార్జీలు, ప్రయాణ సమయంపై ఇంకా స్పష్టత లేదు.. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రధాని నరేంద్రమోదీ సంక్రాంతి రోజున ప్రారంభించిన తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌-విశాఖపట్నంల నడుమ దిగ్విజయంగా నడుస్తోంది. దీనికి విజయవాడ రాజమండ్రి మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం స్టేషన్లో కూడా నిలువుడల చేయలని ఇటీవల ఎంపీ రఘురామా కృష్ణంరాజు రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *