సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో ఎంత అనుబంధం ఉందొ అందరికి తెలిసిందే. రోజుకు 80 ఎక్స్‌ప్రెస్ మరియు 100 ప్యాసింజర్ రైళ్లు వచ్చిపోయే సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్య రోజుకు 2 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది.. మరి ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 750 కోట్ల వ్యయంతో ఆధునీకరణ నిర్మాణాలతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాత భవనాలను కూల్చివేసి, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఎయిర్‌పోర్ట్ తరహాలో తయారు చేస్తున్నారు. ఈ పనులను 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో పూర్తి చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రైళ్లను దాని మళ్లించిన విషయం తేలిందే. తాజా మరో 30 రైళ్ళను సికింద్రాబాద్‌ నుంచి తాత్కాలికంగా దారి మళ్లించారు.. అక్టోబర్ 20 నుంచి 26 వరకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సుమారు 30 రైళ్లను హైదరాబాద్‌లోని ఇతర స్టేషన్లకు తరలించారు. దారి మళ్లింపులో భాగంగా సికింద్రాబాద్-పోర్ బందర్ సర్వీస్ హల్ద్వానీనగర్ నుంచి, పూణే-సికింద్రాబాద్ సర్వీస్ హైదరాబాద్ స్టేషన్ నుంచి, సిద్ధిపేట-సికింద్రాబాద్ సర్వీస్ మల్కాజిగిరి నుంచి బయలుదేరతాయి. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి బయలుదేరే పది ఎక్స్‌ప్రెస్ రైళ్లు తాత్కాలికంగా చేర్యాలపల్లికి మళ్లించబడ్డాయి. ఇందులో సికింద్రాబాద్-రేపల్లె, సికింద్రాబాద్-మణుగూరు, సికింద్రాబాద్-రామేశ్వరం, సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్, సికింద్రాబాద్-అగర్తలా రైళ్లు కూడా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *