సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సికిందరాబాద్ రైల్వే జంక్షన్ నుండి నేటి బుధవారం ప్రయాణికుల రద్దీ కారణంగా ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 12న సికింద్రాబాద్- తిరుపతి (07411), బెంగళూరు- జోధ్‌పూర్ (06589), 13న తిరుపతి-సికింద్రాబాద్ (07412), 14న హైదరాబాద్-గోరక్‌పూర్ (02575), 15న బెంగళూరు కంటోన్మెంట్-విశాఖపట్నం (06587), 16న గోరక్‌పూర్- హైదరాబాద్ (02576)కు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే గుంటూరు డివిజన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా అక్టోబర్ 12 నుంచి 20 వరకు నాలుగు రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. అక్టోబర్ 12 నుంచి 19 వరకు గుంటూరు-డోన్ రైలు (17228), అక్టోబర్ 13 నుంచి 20 వరకు డోన్ -గుంటూరు రైలు (17227), అక్టోబర్ 17, 18 తేదీల్లోగుంటూరు-కాచిగూడ రైలు (17251), 17, 18 తేదీల్లో కాచిగూడ- గుంటూరు రైలు (17252)ను రద్దు చేసినట్టు ప్రకటించారు.
