సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించారు. మరి కొందరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయంలోకి వెళితే.. ఎప్పుడు జనం రద్దీతో కిటకిటలాడే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు రోడ్డులో 4 అంతస్తుల బిల్డింగ్లో పైన అంతస్తులో లార్జ్ క్రింది అంతస్తులో రూబీ ఎలక్ట్రికల్‌ బైక్ ల షోరూం మరియు . సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గోదాము ఉంది. గత రాత్రి సుమారు 9గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఈ-స్కూటర్‌ పేలిపోయింది. చూస్తుండగానే మంటలు మొత్తం వాహనాలకు వ్యాపిం చి, ఒక్కొక్కటిగా పలు వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఆ సమయంలో గోదాములో ఎవరూ లేకున్నా.. పై అంతస్తుల్లో ఉన్న రూబీ హోటల్‌ గదులకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్‌లో 25 మంది బసచేసినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. దట్టమైన పొగ, మంటలతో ఉక్కిరిబిక్కిరైన మరో ఐదుగురు ప్రాణభయంతో కిందకు దూకారు. ఆలోగానే వారికి మంటలంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ హుటాహుటిన 45 నిమిషాలలో సంఘటనాస్థలానికి చేరుకుంది. అయితే.. అప్పటికే షోరూం, గోదాము అగ్నికి ఆహుతయ్యాయి. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సంఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ‘‘మొత్తం 8 మంది మృతిచెందారు. దట్టమైన పొగలతో ఊపిరి ఆడకే మరణాలు సంభవించాయి’’ అని సీవీ ఆనంద్‌ నేడు, మంగళవారం ఉదయం మీడియాకు వివరించారు.ఒకవైపే దారిరూబీ ఎలక్ట్రిక్‌ షోరూం, ఆ హోటల్‌ భవనం నుంచి లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది. భవనానికి సెట్‌ బ్యాక్స్‌లేవు. దీంతో.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *