సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జనసేనాని పవన్ కల్యణ్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. ఆర్జీవీ ట్విటర్ వేదికగా ఘాటు కామెంట్స్ చేశారు. ప్రజల కోసం పని చేసే వాలంటీర్లని పవన్‌కల్యాణ్ అమ్మాయిల బ్రోకర్లు అన్నాడు. అంత నీచాతి నీచంగా అసహ్యంగా వర్ణించబడ్డ ఆ వాలంటీర్లకి సిగ్గు, శరం, ఆత్మా భిమానం ఉంటే వెంటనే వాళ్ళు పవన్‌కల్యాణ్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.. పెట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలకి మొహాలెలా చూపెట్టగలరు?”ని “వైసీపీ ప్రభుత్వం… మహిళల ట్రాఫికింగ్ చేస్తోంది అనే పవన్ కల్యాణ్ ఆరోపణ చరిత్రలో ఇప్పటి వరకూచేసిన ఆరోపణలకన్నింటికీ పరాకాష్ట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఈ విషయం మీద ఆధారాలుంటే యాక్షన్ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ చెవిలో ఎందుకు చెప్పా రు? అని ప్రశ్నించారు ఆర్జీవీ ..
