సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన సిగ్మాన్యూస్ లో ఇటీవల ఈనెల 18వ తేదీన ‘భీమవరంలో అది అండర్ టర్నల్ కాదు.. నీటి మడుగు ‘ అంటూ వేసిన న్యూస్ ఐటెం కు వెంటనే మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు స్వాందన కలిగింది. .అంబెడ్కర్ చౌక్ నుండి విజయలక్ష్మి థియేటర్స్ వరకు నిర్మించిన ప్రధాన రైల్వే అండర్ టర్నల్ లో 19వ తేదీన మోటారు జనరేటర్లు సహకారంతోఅక్కడ 2 దారుల టర్నల్స్ లో మొత్తం నీటిని తొలగించి వాహనదారులకు లైన్ క్లియర్ చేసారు. గత 2 రోజులుగా టర్నల్స్ లోనుపరిస్థితి మెరుగుపడింది. . వేలాది వాహనదారులకు ఇబ్బందులు తొలగిపోయాయి.( తాజా పరిస్థితి ఫై ఫొటోలో చూడవచ్చు).గత 3రోజులుగా అక్కడ సానిటరీ పనివారు అండర్ టర్నల్ ప్రక్కన నిర్మించిన డ్రైన్స్ ను సైతం మూతలు తెరచి అక్కడ పేరుకున్న చెత్త తొలగించారు. ఇక మరి కొద్దీ కాలంవరకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా నీరు వేగంగా డ్రైన్ లో వెళ్లిపోయే విధముగా పనులు నేటి సోమవారం తో పూర్తీ చేసారు. ప్రస్తుతం టర్నల్స్ లో వాహనాలు ఎటువంటి బురద భయం లేకుండా రయ్యి రయ్యి మని దూసుకొని పోతున్నాయి. అయితే ఇదే శ్రద్ద ఈ వర్షాకాలం అంతటా కొనసాగితే వాహనదారులకు మేలు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *