సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సగం.. సగం రోడ్డు పనులు అంటూ.. మన సిగ్మా న్యూస్ లో ఇటీవల వేసిన న్యూస్ ఐటెం కు ఆర్ & బి అధికారుల నుండి స్వాందన వచ్చింది. ఈ ఉండి రోడ్డు బై పాస్ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఇటీవల అధికారులకు గట్టిగ ఆదేశాలు ఇచ్చారు. దీనిలో భాగంగా ఇప్పుడు పనులు మొదలు పెట్టారు. భారీగా గ్రావెల్ దించి పనులు ప్రారంభించారు. అయితే అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి మరల మధ్యలో వదిలేకుండా పనులు పూర్తీ చేస్తారని భావిద్దాం.. మరల విషయంలోకి వెళితే భీమవరం పట్టణం కు ట్రాఫిక్ రద్దీ కి విరుగుడుగా నిర్మించిన బై పాస్ రోడ్డు చాల మటుకు పట్టాన వాసులతో పాటు దూరప్రాంతాల నుండి వచ్చే వాహన దారులకు చాల మటుకు ట్రాఫిక్ కష్టాల నుండి రక్షిస్తుంది అన్న మాట వాస్తవం. అయితే బివి రాజు విగ్రహం జంక్షన్ నుండి ఉండి రోడ్డు ను కలుపుతూ వేసిన బై పాస్ లోని కొత్త సిసి రోడ్డు గ్యాప్ గ్యాప్ లతో గత 4 నెలలుగా వాహనదారులను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. కిలో మీటర్ పైగా అక్కడక్కడా బిట్ బిట్ ల క్రింద సిమెంట్ రోడ్లు వేసి వదిలేసారు. మధ్య మధ్య సుమారు 10 చోట్ల వరకు గ్యాపులు వదిలేసారు. అసలే భారీ వర్షలతో పడి మధ్య మధ్య గ్యాపులు వదిలెయ్యడం వల్ల అక్కడ గుంతలు మరింత పెద్దవి గా మారి గ్రావెల్స్ పైకి లెగిసి పోయి వాహనాల టైర్లకు పంచర్ లు పడే ప్రమాదం కలిగిస్తుంది. మరి కొద్దీ రోజులలో ఈ ఉండి రోడ్డు బై పాస్ సమస్య పరిష్కారం అవుతుందని భావిద్దాం.. ( పైన తాజా ఫోటో..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *