సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ రామ భక్తులకు, మన సిగ్మా న్యూస్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు, ” శ్రీరామ నవమి” పర్వదిన శుభాకాంక్షలు.. తెలియజేస్తున్నాము. శ్రీరామ చరితం స్వర్వ మానవాళికి శ్రేయోదాయకం.. ఈ భారతావని ఫై నడచిన చారిత్రక పురుషుడు.. రామాయణం మహా గ్రంధంలో పేరుకున్న శ్రీ రామచంద్రుని జీవితంలో పాటించిన మానవతా విలువలు, కుటుంబ విలువలు ఒక రాజు , పాలకుడు ప్రజాభిష్టానం కొరకు ఎలా కంకణ బద్ధుడై ఉండాలో..తప్పు చేస్తే ఎంతటి గొప్ప వీరుడు శివభక్తుడు రావణుడినైనా ఎలా శిక్షించాలో .. రామ రాజ్యం అంటే ఎలా ఉంటుందో? ఇప్పటికి తరాలకు భవిషత్తు తరాలకు ఒక మార్గదర్శిలుగా నిలచిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమానుల జీవిత గాధలు సకల ప్రపంచ మానవాళికి ఆదర్శనీయం.. ఇంతటి పుణ్య చరితులు సంచరించిన భారతావనిలో ” శ్రీ రామనవమి ” వేడుకలు లో శ్రీ సీతారాముల కల్యాణాలు ప్రతి ఏడాది ఈ రోజు జరగడం మానవాళికి లోకకల్యాణం గా భావిస్తు.. అందరికి శుభాభినందనలు.. జై శ్రీరామ్.. మీ సిగ్మా ప్రసాద్
