సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్” తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఇదే ఊపులో ‘జాక్’ మూవీతో హ్యాట్రిక్ కొట్టేస్తాడని అంతా భావించారు. సిద్ధు జొన్నలగడ్డ, బేబీ పేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా ‘జాక్’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్ట్ భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మార్కెట్లో ఈ సినిమా చూసినవారు బొమ్మరిల్లు భాస్కర్ ‘జాక్’ మూవీకి ‘కొంచెం క్రాక్’ అనే ట్యాగ్ లైన్ కరెక్ట్ గా పెట్టారు. దీనిని చూస్తున్నంత సేపు సిద్ధు క్యారెక్టరైజేషన్ కొంచెం కాదు… చాలా పెద్ద క్రాక్ అనిపిస్తుంది. అంటున్నారు. ఏది ఏమైనా యూత్ ప్రేక్షకులను టార్గెట్ గా సామ్ సి. ఎస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొంత మెప్పించారని, హిందీ సాంగ్ అదిరింది అని ,సినిమా కధలో భాగంగా టెర్రరిస్టుల అటాక్స్ ను, వారిపై చేసే ఎదురుదాడిని సరిగ్గా తియ్యలేకపోయారని, క్లయిమాక్స్ అయితే మెప్పించలేదని పబ్లిక్ టాక్
