సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కె విశ్వనాథ్ మరణించారని తెలియగానే దేశ వ్యాప్తంగా ఆయన దర్శకత్వంలో నటించిన సూపర్ స్టార్ లు కమల్ హాసన్, అమితాబ్, చిరంజీవి, ముమ్మాటి, మిదున్ చక్రవర్తి, అనిల్ కపూర్ ,జాకీష్రాఫ్, అజయ్ దేవగన్,ఆయనతో తమ అనుభూతులను పంచుకోగా ,కమల్ హాసన్ తరహాలో ఆయనతో మంచి అనుబంధం ఉన్న తెలుగు హీరో వెంకటేష్.. తెలుగులో స్వర్ణ కమలం, చిన్నబ్బాయ్ వంటి చిత్రాలతో పాటు కే విశ్వనాధ్ ప్రధాన పాత్రలో కలిసుందాం రా.. ఆడవాళ్ళ మాటలకూ అర్ధాలు వేరులే వంటి పలు బంపర్ హిట్ సినిమాలలో ఆయనతో దెబ్బలు తిన్న మనవడిగా నటించిన విక్టరీ వెంకటేష్ మాత్రం ఆయన పార్ధీవ దేహాన్ని చూడటానికి కన్నీటి తో రావడం అందరిని విస్మయానికి గురిచేసింది. తనకు నటనలో పరమార్ధం అంటే ఏమిటో స్వర్ణ కమలంలో విశ్వనాధ్ దర్శకత్వంలోనే అర్ధం అయ్యిందని అటువంటి గురువును నా మనస్సుకు నచ్చిన స్వంత మనిషి, సినిమాలకు అతీతంగా నేనంటే ఎక్కువ ఇష్టపడే కళ తపస్వి పెద్దాయన ను కోల్పొయానని వెంకీ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *