సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సత్తెనపల్లి లో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో రప్ప రప్ప నరుకుతాం..( rapa rappa) అంటూ డైలాగ్స్ తో ప్లే కార్డు ప్రదర్శన తో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చెయ్యడం దానిపై జగన్ మాట్లాడుతూ.. అది టీడీపీ కి చెందిన కార్యకర్త ( ఐడి కార్డు రిజిస్ట్రేషన్ కూడా ఉంది) ప్లే కార్డు ప్రదర్శించాడని తెలిసిందని.. టీడీపీ నేతలు హామీలు నెరవేర్చకుండా తమను మోసం చేశారనే ఆవేదనతో స్వంత పార్టీ నేతలను నరకుతాం అని పెట్టి ఉండవచ్చని ఎద్దేవా చేస్తూ.., అయినా పుష్ప సినిమా డైలాగ్ అని అందరికి తెలుసునని దానికే టీడీపీ పెద్దలు కంగారు పడితే ఎలా? మీరు ప్రజలను మోసం చేసారు కాబ్బటి వారు మీ సభలకు రావడం మానేశారు.. నా పర్యటనలకు ప్రజలు అభిమానంతో తరలి వస్తున్నారు. ఎంత మంది వైసీపీ నేతలను అక్రమ కేసులు పెట్టిన తగ్గేదే లేదు.. అంటూ అల్లు అర్జున్ తరహాలో జగన్ తన రెండు చేతులతో అనుకరించారు. ఇదిలా ఉండగా రప్ప రప్ప డైలాగ్ ఫై ,శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరికేస్తామంటూ పుష్ప డైలాగులతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రౌడీ షీట్స్ ఓపెన్ చెయ్యాలని పోలీసులను ఆదేశించారు సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి..ఆ డైలాగులకు అనుగుణంగా మేం ప్రవర్తిస్తాం అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని అన్నారు.వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను చేసేవారిని ప్రజలంతా గమనించాలి కోరారు. అసాంఘిక శక్తులను రెచ్చగొట్టేలా వారికీ మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోకూడదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *