సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ సమకాలీన రాజకీయాలపై ఇటీవల స్పీడ్ పెంచారు. ఆయన గతంలో తెలంగాణ లో బిఆర్ ఎస్ పార్టీకి సన్నిహితంగా వ్యవహరించిన విషయం అందరికి తెలిసిందే.. అక్కినేని నాగార్జునకు మిత్రుడు .. తాజాగా కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల ఫై ప్రకాష్ రాజ్ విరుచుకు పడ్డారు. ఆయన ‘X’ ఖాతా ద్వారా మంత్రి కొండా ఫై అసహనం వ్యక్తంచేస్తూ.. . ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇద్దరు ఆడబిడ్డల వ్యవహారాల్ని సరైన ఆధారాలు లేకుండా నీచ రాజకీయాల కోసం మంత్రి హోదాలో ఒక స్త్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ తాజగా కేటీఆర్ ను విమర్శిస్తూ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రస్తావించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *