సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో గ్యాంగ్ విలన్ లలో తన హాస్యం తో ప్రత్యేక స్తానం పొందిన నటుడు ఫిష్‌ వెంకట్‌ (Fish Venkat) కగత శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. చేపల పాటు దిల్, అది, గబ్బర్ సింగ్,బన్నీ , కృష్ణ, చెన్నకేశవ రెడ్డి , ‘అత్తారింటికి దారేది’ సినిమాలతో పాపులర్‌ అయిన అయన దాదాపు నాలుగేళ్లగా కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నారు. తన రెండు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్‌ ద్వారా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు కిడ్నీలని మార్పిడి చేయాలని, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని వైద్యులు చెప్పినట్లు ఇటీవల ఆయన కుమార్తె స్రవంతి తెలిపిన సంగతి తెలిసిందే! ఫిష్ వెంకట్ కు హీరో ప్రభాస్ పీఏ సహాయం చేస్తానని ఫోన్ చేసినట్లు స్రవంతి ప్రకటించిన తరువాత కారణాలు ఏవైనా .. ఆ వార్త ను ఆమె తల్లి ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *