సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు వైసీపీ నేత ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్‌పై గుంటూరు జైలు నుంచి గత శనివారం విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఆయనకు నిజానికి మొన్న శుక్రవారమే బెయిల్ లభించింది. అయితే బెయిల్ పత్రాలు సమర్పించడం ఆలస్యం అవ్వడంతో.. శనివారం విడుదలయ్యారు.. గత ఫిబ్రవరి నెల 26న పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు. పలుమారులు కోర్ట్ ఆయనకు బెయిల్ లు ఇచ్చినప్పటికీ కొత్త కేసులు నమోదు అవుతుండటంతో విచారణ పేరుతో వేరు వేరు ప్రాంతాలకు పోలీస్ స్టేషన్ లకు తీసుకొనివెళ్ళటం తో ఆయన విడుదల ఆలస్యం అయ్యింది.వైసీపీ పార్టీ కి ఆయన దూరముగా ఉన్నపటికీ అధినేత జగన్ ఆదేశాలతో పోసాని ని బెయిల్ ఫై విడుదలకు విశ్వ ప్రయత్నాలు చేసారు. ఆఖరికి పోసాని అరెస్ట్ అంశం రాజ్య సభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకోని వెళ్ళటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *