సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక..మెగాస్టార్ చిరంజీవి సినీహీరోగా 7 ఏళ్ళ క్రితం రి ఎంట్రీ అయ్యాక తొలిసారి గత సంక్రాంతి కి విడుదలయి నికార్సయిన ఘన విజయం సాధించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో హీరో రవితేజ కూడా ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. ఈ సందర్భంగా చిరంజీవి, రవితేజా, దర్శకుడు బాబీ తో సహ చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. చాల కాలం తరువాత వాల్తేరు వీరయ్య చిత్ర విజయం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మెగాస్టార్ , ‘‘ఒకప్పుడు.. సినిమాలు 100, 175,200 రోజులు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాలే ఆడుతున్నాయి. ఇలాంటి నేపథ్యం లో ‘వాల్తేరు వీరయ్య ’ 200 రోజులు ప్రదర్శిచడం, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది అన్నారు. వేదికపై చిరంజీవి మాట్లాడుతూ అకస్మాతు గా రాజకీయాలపై వివాదాస్వాద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలతను ఉద్దేశించి.. గతకొన్నేళ్లుగా సినీ పరిశ్రమను కొన్ని రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయని ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..’’ అని ఏపీలోని జగన్ సర్కార్ ఫై పరోక్షంగా తన అసహనాన్ని బయట పెడుతూ వ్యాక్యలు చేసారు. వెంటనే వేదికపై ఉన్న హీరో రవితేజ చిరు కు 2 అడుగుల ప్రక్కకు జరిగి తన రెండుచేతులు వెనక్కి పెట్టుకొని మోనంగా నిలబడిపోవడం గమనించవచ్చు..
