సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని జగన్ సర్కార్ ‘పిచ్చుక వంటి సినీ పరిశ్రమపై బ్రహ్మస్తం వేస్తుందని, ప్రత్యేక హోదా ప్రజా పాలనపై ద్రుష్టి పెడితే మంచిది’ అని చిరంజీవి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఫై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. నేడు, మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ..సినీ పరిశ్రమలో కొందరు ‘పకోడీ గాళ్ళు ఉచిత సలహాలు ఇస్తుంటారని.. ఈ ఇచ్చేదేదో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తే మంచిదని , మనకెందుకురా రాజకీయాలు..మనం సినిమా వాళ్ళం ..మన సినిమాలో డాన్సులు, ఫైట్స్ ఫై ద్రుష్టి పెట్టాలి కానీ అనవసరపు విషయాలలో వేలు పెట్టకూడదు అని సలహాలు ఇస్తే మంచిదని పకోడీ గాళ్ళు తెలుసుకుంటే మంచిదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
