సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రముఖ సినీ గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామాశాస్త్రి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ప్రకటించారు. సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులు. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలానే సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇటువంటి సమయంలో సీఎం జగన్ తమకు అండగా నిలిబడినందుకు గాను సిరివెన్నెల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఆయన కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
