సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిత్యావసర వస్తువుల అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. మరో ప్రక్క విద్యుత్తూ బిల్లులు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ఫై కస్టమ్స్ టాక్స్ రేట్లు పెంచేశారు. ఇక తాజగా గృహ అవసరాలకు వినియోగించే 14న్నర కేజీల సిలెండర్ గ్యాస్ ధరను 50 రూపాయలు చప్పున కేంద్ర ప్రభుత్వం తాజగా నేటి మంగళవారం నుండి పెంచేసింది. సిలిండర్ ధర రూ. 827.50 కాగా రూ.50 పెంచడంతో రూ.877.50కి పెరగనుంది. ఇంటికి డెలివరీ చార్జీలతో ఇకపై 900 పైమాటే ధర పలుకుతుంది.తాజగా పెరిగిన గ్యాస్ ధర పెంపుతో పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 6.21 లక్షల మంది వినియోగదారులపై అదనంగా రూ.3.11 కోట్ల భారం పడుతుందని అంచనా..అయితే గ్యాస్‌తో పాటు డీజిల్, పెట్రోల్‌పై కూడా భారం మోపినప్పటికీ ఈ భారాన్ని కంపెనీలు భరిస్తాయని చెప్పడం వినియోగదారులకు ప్రస్తుతానికి కొంత ఊరట. అతి త్వరలో వాటి ధరలు పెంపు ఖాయం.. ఇక నిత్యావసర వస్తువుల ధరలు పెంపు మరోసారి ఖాయంగా కనిపిస్తుంది.
