సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సివిల్స్ జాతీయస్థాయిలో 833 వ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు కుమారుడు కొయ్యే చిట్టిరాజుకు డిఎన్నార్ విద్య సంస్థలలో అభినందన సత్కారం, విద్యార్ధులతో ముఖా భేటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్టిరాజు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగాలని, విద్యతోపాటు ఎక్కువగా గ్రంథాలయాలను అనుసరించాలని, నేను కూడా ఆటలు ఆడుకునే వాడిని అని, ఒక గోల్ తో సివిల్స్ లో ర్యాంక్ సాధించానని అన్నారు. మా తండ్రి మోషేన్ రాజు మాకు స్ఫూర్తి అని, సెయింట్ జొన్స్ స్కుల్లో, డిఎన్నార్ కళాశాలలో ఇటువంటి సత్కారం చేయడం ఆనందంగా ఉందన్నారు. కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) మాట్లాడుతూ తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉన్నా చిట్టి రాజు తన శైలిని విద్యలో ప్రతిభ చాటడం గొప్ప విశేషమని, విద్యార్థులంతా చిట్టి రాజును ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం చిట్టి రాజును సత్కరించారు. కార్యక్రమంలో చిట్టి రాజు సోదరులు కొయ్య సుందర్ రాజు,విజ్ఞవేదిక రంగసాయి, కళాశాల పాలకవర్గం ,కొత్తపల్లి శివరామ రాజు, కునపరాజు రామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ అంజన్ కుమార్, ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ కే సోమరాజు, డాక్టర్ ఎ వీరయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *