సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కందుకూరు దుర్ఘటన షాక్ నుండి తేరుకొని..‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా లో పర్యటిస్తున్న చంద్రబాబు తాజగా మాట్లాడుతూ.. టీడీపీ రాకముందు బీసీ (BC)లను కేవలం ఓటర్లుగానే చూశారని, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక వెనకపడ్డ వర్గాలను ముందుకు నడిపించారని అన్నారు. అదే సంప్రదాయాన్ని తాను కొనసాగించామని, బీసీలకు టీడీపీ ఉన్నతమైన పదవులు ఇచ్చిందని, రాజ్యాధికారంలో 50 శాతం భాగస్వామ్యం ఉన్న బీసీలకు తాము 34 శాతం రిజర్వేషన్ తెస్తే, ఇప్పుడున్న సీఎం జగన్ దానిని 24 శాతానికి తగ్గించారని ఆరోపించారు. తాను సీఎం అయిన వెంటనే బీసీల అభివృద్ధికి మొదటి సంతకం చేస్తానని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే నీతి నిజాయితీ కలిగిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై అక్రమంగా కేసుపెట్టి, జైలులో పెట్టి పైశాచిక ఆనందం పొందారని , టీడీపీలోని బీసీ నేతలను అక్రమ కేసులతో వేధించారని ఆరోపించారు.
