సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 12వ వార్డుకి చెందిన క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న పెదవెంక మణి జీవనోపాధి నిమిత్తం తోపుడుబండిని భీమవరం నియోజకవర్గం ఇంచార్జ్, తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర టీడీపీ కోశాధికారి, మెంటే పార్ధసారధి చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ..సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల నుండి తాను అర్జీలు స్వీకరించడం జరుగుతుందని, తద్వారా’ సీఎం రిలీఫ్ పండ్’ అందిస్తున్నామని, అందులో భాగంగా టిడ్కో గృహాలలో నివాసమంటున్న పేద మహిళ పెదవేంక మణి జీవనోపాధి చిరువ్యాపారం కోసం తోపుడుబండి కోసం అర్జీ ఇవ్వటం జరిగిందని దీనిపై భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగని రమేష్ సహకారంతో పేద మహిళకు 20 వేల రూపాయలు వెచ్చించి తొపుడిబండిని అందజేసి వారి కుటుంబానికి అండగా నిలవడం సంతోషకరమని, తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ మెరగాని నారాయణమ్మ ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంట త్రిమూర్తులు రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ ,మరియు నేతలు మద్ధుల రాము చల్లబోయిన గోవింద్ మాజీ కౌన్సిలర్లు మైలబత్తుల ఐజాక్ బాబు విజ్జురోతూ రాఘవలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *