సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల రొయ్య ఎగుమతుల ధర తగ్గడం, భారీగా మెతలు ధరలు పెరిగిపోవడం ,వరుస భారీ వర్షాలతో ఆక్సిజన్ అందక భారీ పంట నష్టం జరిగి నష్టాల భారిన పడుతున్న ‘ఆక్వా రాజధాని’ భీమవరం ప్రాంత ఆక్వా రైతులు ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పటు చేసుకుని ఇటు కలెక్టర్ దృష్టికి అటుపై ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తమ పరిస్థితులను తీసుకొనివెళ్ళటంతో .. వారి సమస్యలు స్వయంగా తెలుసుకొన్న సీఎం జగన్ వెంటనే ఇటీవల ఒక కమిటీని నియమించారు. దీనిలో సభ్యులుగా ఉన్న మం త్రులు, నిపుణులు అమరావతిలో నిన్న బుధవారం సమావేశమయ్యా రు. ఆక్వా రైతులకు భారంగా పరిణమించిన మేతల ధరలు తగ్గించవలసిందేనని, ధరలను బ్లాక్ చేస్తున్న సిండికేట్ల పని పట్టవలసిందేనని ముందే వారికీ సీఎం బలమైన ఆదేశాలు ఇవ్వడంతో మంత్రులు, ఆక్వా రైతు నేతల సంయుక్త కమిటీ నేటి గురువారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో ఆక్వా రైతులు, మేతల తయారీ, ఎగుమతి సం స్థల ప్రతినిధులతో సమావేశం లో భీమవరం జోన్ నుండి రైతు సం ఘం ప్రతినిధులు పాల్గొని వారి సమస్యలు మరోసారి వారి దృష్టికి తెచ్చారు. అసలు ముందుగా అంతర్జాతీయంగా ముడి సరకు ధరలు, ఉత్ప త్తి తదితర అం శాలను పూర్తిగా పరిశీలిం చి మేతలు ధరలు ఏ మేరకు తగ్గించవచ్చునో ? అలాగే రొయ్య ల ధరను స్థిరీకరిం చాలి. వంద కౌం టు ధరను కనీసం రూ.250గా నిర్ణయించాలి అన్న డిమాండ్ ఫై ప్రభుత్వ స్వాందన సానుకూలంగా వస్తుందని ఆక్వా రైతులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. అసలు ఆక్వా రంగంలో విభాగాలన్నింటినీ ఒక చోటికి తీసుకోని రావడానికి ప్రభుత్వం ఆక్వా ప్రముఖులతో చర్చిస్తుంది.
