సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దళితులపై దాడులను, స్థానిక పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్ ను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు, శనివారం లేఖ రాశారు. తమ భూముల్లో అక్రమ తవ్వకాలపై పోరాటం చేస్తున్న దళితులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ తమ అనుచరుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. మట్టి అక్రమ రవాణా కోసం కొన్ని చోట్ల ఏకంగా గ్రావెల్ రోడ్లను నిర్మించారు. దీనిపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ధిక్కరించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. స్థానిక దళితులపై జరిగిన పోలీస్ ఈ లాఠీ చార్జ్‌లో గాయపడిన వారికి సత్వర వైద్యం చెయ్యకపోగా పోలీసులు బాధితులను సమీపంలోని పాలకొల్లు ఆసుపత్రికి తరలించకుండా, దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇలాగా ? ప్రవర్తించేది? అని లేఖలో ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *