సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఢిల్లీలో నేడు, శుక్రవారం రచ్చబండ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ సిట్ పోలీసులు తనకు సీ ఆర్ పీ సీ 41 కింద నోటీసును అందజేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ నోటీసులు నేడు, శుక్రవారం అందాయని నిన్న కాదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కలలో కూడా కీడు చేసే ఆలోచన తనకు లేదని అన్నారు. తాను ఏనాడు కూడా కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఆంధ్ర ప్రజలు తెలంగాణకు వలస వెళుతున్నారని తన రచ్చబండ కార్యక్రమంలో గతంలోనే చెప్పానని అన్నారు. తనను ఏమైనా చేస్తే సెటిలర్ల ఓట్లు జారిపోతాయని తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు తెలుసునని అన్నారు. సిట్ తనకు నోటీసులు ఇవ్వడం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఇష్టం ఉన్న వ్యక్తిగా, ఆ ప్రభుత్వానికి హాని చేయాలని ఆలోచన లేదని మరోసారి పునరుద్ఘాటించారు.
