సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ వైసిపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల నేడు, శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై తో షర్మిల భేటీ అయి వైద్యవిద్యార్ధిని ప్రీతి ర్యాగింగ్, ఆత్మహత్య ప్రయత్నం అంశంపై చర్చించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం చాల దారుణంగా ఉందని తెలంగాణలో వాస్తవ పరిస్థితులను వివరించేందుకే గవర్నర్‌ను కలిశానని, దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉంటే తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతుంది. తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం లేదు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.బీఆర్ఎస్ (BRS) నేతలు గుండాలుగా ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరాను . ఒక బాలుడిని వీధి కుక్కలు దాడి చేసి పసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కులేదు. తెలంగాణలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారు. కెసిఆర్ సీఎంగా ఉండగా రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం వైఎస్‌ఆర్‌టీపీకి, ప్రతిపక్షాలకు లేదు. అందుకే అందరం కలసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరుతున్నాం. ఇదే విషయంపై త్వరలో రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం.’’ అని షర్మిల అన్నారు.
