సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; గతంలో ఎవ్వరు సాహసించని విధంగా.. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు నోటీసులు పంపి తెలుగునాట సంచలనం సృష్టించిన ‘పులివెందుల’ పోలీస్ మాజీ సీఐపై క్రమశిక్షణా చర్య కింద సర్వీసు నుంచి తొలగిస్తూ కీలక ఉత్వర్వులు జారీ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసుల నుంచి తొలగిస్తూ.. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ డిస్మిస్ చేశారు. డీఐజీ ఆదేశాలతో క్రమశిక్షణ చర్యలలో భాగంగా శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తాజగా ఉత్తర్వు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్లో ఉన్నారు.కొద్దీ నెలల ముందు అసెంబ్లీలో వైఎస్ వివేకా హత్య కేసు విషయాన్ని సీఎం చంద్రబాబు వివరిస్తూ.. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు సీఐ శంకరయ్య సమక్షంలోనే ఆధారాలను చెరిపివేశారని, ఘటనా స్థలంలోని శంకరయ్య ఉన్నా అడ్డుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలను చేసి తనను ఇరికిస్తున్నారని 29 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేస్తున్నానని.. తన పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించాయని తనకు క్షమాపణ చెప్పాలని, రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని సీఐ శంకరయ్య ఆగ్రహంతో గత సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు.
