సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయంలో దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు (ఎంపీ, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే) సిఫారసు లేఖలను అనుమతించాలని నేడు, మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ సిఫార్సు లేఖలపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్‌కు తెలంగాణ అసెంబ్లీతరపున సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత అన్ని రంగాలలో తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ నేతలు విభజన రేఖలు గీసుకొన్నారు. అయితే తిరుమల తిరుపతిలో శ్రీ వారి దర్శన విషయంలో తెలంగాణ ప్రజా పార్టీనిదుల సిపార్స్ లేఖలకు దర్శనాలకు అనుమతి ఇవ్వటం లో అప్పటి చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. అయితే తరువాత వచ్చిన సీఎం జగన్ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ లోని భక్తులకు శ్రీవారి ప్రశాంతమైన దర్శనంకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడి AP ప్రజా ప్రతినిధుల సిఫర్స్ లేఖలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని.. తెలంగాణ సిఫార్స్ లేఖలకు దర్శనాలు ఇవ్వకూడదని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అప్పట్లో తెలంగాణ వారు రిక్వస్ట్ చేసినప్పటికీ అప్పటి సీఎం జగన్ ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. తెలంగాణ నుండి కూడా సిఫార్స్ లేఖలు వస్తే టీటీడీ అధికారులపై భక్తుల దర్శనాల అదనపు ఒత్తిడి పెరుగుతుందని, VIPలు పెరిగిసామాన్య దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతుందని భావించారు.
