సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో స్కిల్ డెవలప్‌మెంట్స్ స్కాం కేసు లో అరెస్ట్ అయిన ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు బెయిల్ రద్దు.. నేటి శుక్రవారం సుప్రీం కోర్ట్ విచారణ ఫై అందరు ఆసక్తిగా ఎదురు చూసారు .. గతంలో ఏపీ హైకోర్టు తీర్పును గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై నేడు శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వర్చువల్‌గా వాదనలు వినిపించారు.అయితే విచారణకు హాజరు కావలసిన చంద్రబాబు తాను ఢిల్లీలో లేనని, విచారణకు స్వయంగా హాజరు అవుతానని జనవరి వరకు సమయం ఇవ్వాలని చంద్రబాబు కోర్ట్ ను కోరారు. దీంతో జనవరి రెండో వారానికి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేదీ ధర్మాసనం ప్రకటించింది.
