సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు ( Chandrababu) మరోసారి విదేశీ పర్యటనకు నేడు, బయలు దేరుతున్నారు. ఆయన దుబాయ్‌ (Dubai), అబుదాబి, UAEలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో (Vishakha) జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో ఆయన పర్యటిస్తారని సమాచారం. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళుతున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ (Lokesh) సైతం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ విదేశీ పర్యటనలు అని కూటమి నేతలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *