సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: అమరావతిలో సీఎం వైఎస్‌ జగన్‌ తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ ముగిసింది. సమావేశంలో పీఆర్సీపై చర్చ కొనసాగింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు. మరోసారి సీఎంతో ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నారు. ఈ చర్చలలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నానని తెలిపారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. దయచేసి అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని, మంచి చేయాలన్న తపనతో ఉన్నామని తెలిపారు. 2, 3 రోజుల్లో దీనిపై ప్రకటన ప్రకటన చేస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *