సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల వివాదాల స్పెషలిస్ట్ రాంగోపాల్ వర్మ ఏపీలో సినిమా టికెట్స్ ధరల తగ్గింపు ఫై ఏపీలో జగన్ ప్రబుత్వం నిర్ణయం కరెక్ట్ కాదని, అనేక ప్రశ్నలు సంధించడం, మీడియాలో రచ్చ చెయ్యడం, దానికి మంత్రి పేర్ని నాని స్వాందించి కౌంటర్లు ఇవ్వడం అందరుచూస్తున్నదే.. అయితే వర్మ కు తాజాగా మంత్రి పేర్ని నాని.. తాను రాంగోపాల్ వర్మ సినిమాల అభిమానినని సినిమా టికెట్ల ధరలపై చర్చించడానికి తనను సంప్రదించాలని, తనను కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంతో వర్మ హర్షం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానిని కలుస్తానని దర్శకుడు ఆర్జీవీ అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్‌లు చేస్తూ.. ‘పేర్ని నాని గారు ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలి అన్నది మా ఉద్దేశం కాదు.. పర్సనల్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే నాకు చాలా అభిమానం. కేవలం మా సమస్యలు మేము సరిగా చెప్పుకోలేక పోవడం వల్లనో లేక , మీరు మా కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్లలో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడింది’ అంటూ ట్వీటర్‌లో రాసుకొచ్చారు.
