సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో నేడు, బుధవారం జరిగిన కేబినెట్ మంత్రుల భేటీ ముగిసింది. ఇప్పటికే స్టేట్ ఇన్వె స్ట్మెంట్ప్ మోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు పేదలకు లాంగ్ పర్చేజ్ స్కీమ్ క్రింద ఇచ్చిన 16,213 ఎకరాల భూముల స్థలాల ఫై రుణమాపీ చేసారు. సీఆర్డీఏ పరిధిలోని ఆర్5 జోన్లో 47 వేల ఇళ్ల నిర్మా ణాలకు ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు, మూలపేట పోర్టు నిర్మాణం కోసం రూ.3,880 కోట్లు రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొ రేషన్ ద్వారా తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు వ్య వసాయ భూమి, లంక భూములు కేటయించడానికి ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పం పెడ్ స్తోరేజీ ప్రాజెక్టుకి ఆమోదం లభించింది.
