సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ని నేడు, శుక్రవారం ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై సీఎం కు మీరు చేసిన మేలు మరిచిపోలేమని చెప్పి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలులో బం డి శ్రీనివాసరావుమీడియాతో మాట్లాడుతూ.. మా ఉద్యోగులకు సీఎం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఉద్యోగులకు కావాల్సిన రాయితీలను ప్రకటించడం సంతోషకరం , 16 శాతం హెచ్ఆర్ఏ ప్రకటించినందుకు, అలానే 12వ పీఆర్సీ ప్రకటించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు అన్నారు. ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ.. గత టీడీపీ హయాంలో పీఆర్సీ కమిషన్ అడిగినందుకు ఉద్యొగులను గుర్రాలతో తొక్కించారు. అయితే మాకు ఇచ్చిన మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వస్తాయి. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవి’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *