సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దర్శకుడు రాంగోపాల్ వర్మ తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు. సీఎం జగన్ను కలిసేందుకు ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అరగంటకు పైగా జగన్, రాంగోపాల్ వర్మ మధ్య సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. అయితే వివరాలు బయటకు తెలియరాలేదు. గతంలో దేశంలో నెంబర్ వన్ దర్శకుడుగా, నిర్మాతగా శివ, రంగీలా, గాయం,సత్య, కంపెనీ, దొంగ దొంగ, జేమ్స్, దిల్ సే, రక్త చరిత్ర సర్కార్1,2 వంటి బంపర్ హిట్ సినిమాలతో పాపులర్ అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సినిమాలు ప్లాప్ కానీ (లక్ష్మిస్ ఎన్టీఆర్ మినహా..),అయితే వాటి ప్రభావం అంతో ఇంతో ఉండి తీరుతోంది. అలాగే ఏదోరకంగా ప్లాప్ సినిమాను సొమ్ము చేసుకోవడం అతని ఆర్ట్.. ఎవరికీ భయపడకుండా పాయింట్ బ్లాక్ లాజిక్ తో మాట్లాడే అతని మాటతీరుకు ఉన్న అతని క్రేజ్ లో మాత్రం మార్పులేదు.. ఇక గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ లపై తనదయిన విమర్శన ధోరణి లో వారి ఇమేజ్ డామేజ్ చేసే తరహాలో సినిమాలు తీసి వైసిపి కి పరోక్షంగా మేలు చేసే రాంగోపాల్ వర్మ తో ఇప్పడు సీఎం జగన్ తో జరిగిన సమావేశంపై అనేక రకాల అనుమానాలు తలెత్తాయి. జగన్ సర్కార్ కు మద్దతుగా వర్మ దర్శకత్వంలో ఏదైనా పొలిటికల్ సినిమా ప్లాన్ జరుగుతుందా?ఇప్పటికే ‘ జగమొండి” అనే సినిమాకు వర్మ సిద్ధం అవుతున్నట్లు అయితే ఇండస్ట్రీలో అయితే టాక్ నడుస్తుంది. చూడాలి..
