సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శనివారం రాత్రి 8గంటల 12 నిమిషాల ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ శివార్లలో పర్య టిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, కరెంట్ తీసినప్పుడు.. ప్రజలు పువ్వులు విసురుతున్నపుడు ఊహించని రీతిలో రాళ్ల దాడి జరగటం జగన్ ఎడమకంటి ఫై భాగంలో గాయం కావడం 3 కుట్లు వేసి వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెప్పడం తో నేడు, ఆదివారం యాత్ర కు విరామం ప్రకటించడం జరిగింది. ఈ దాడి దేశంలోని నేతలను కదిలించింది. నేషనల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ దాడిపై ఇతర రాష్ట్ర సీఎంలు, రాజకీయ ప్రముఖులు, ప్రధానమం త్రి కూడా స్పందించారు. జగన్ పై దాడి విషయంలో గత రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెంటనే ట్విటర్ లో స్పందిస్తూ .. ప్రజా స్వామ్యంలో ఇటివంటి దాడులు చెయ్యడం హేయమని, సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం చారు.జగన్ పై దాడి విషయంలో తమిళనాడు సీఎం ఎం కే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ లు కూడా స్పందించారు. ఏపీలో రాజకీయ వైరుధ్యాలు ఇలాంటి హింసాత్మక చర్యలకు దారి తీయడాన్ని స్టాలిన్ ఖండించారు. ప్రధాని మోడీ ఖండన తరువాత కొద్దీ సేపటికి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా దాడి ఫై తన ఖండన విడుదల చెయ్యడం గమనార్హం. వైసీపీ లో కీలక నేతలుమాత్రం.. జగన్ ప్రభంజనం గురించి ఒక్కటి మినహా 9 సర్వే లు ఇప్పటికే ప్రకటించడం తో కక్ష తో ఈ డాడీ వెనుక టీడీపీ జనసేన కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *